ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!

Revanth Reddy’s own goal..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణలో లిక్కర్ కుటుంబాన్ని ఇంటికి పంపించాము. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలకు నేను గ్యారంటీ అని అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేశాము అని నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు మాట్లాడుతున్నారు.
మహిళలకు నెలకు ఇస్తామన్నా రెండున్నర వేలు ఎక్కడ ఇచ్చారు. రైతు భరోసా పదిహేను వేలు ఎవరికిస్తున్నారు. పన్నెండు వేలు ఏ రైతు కూలీకిస్తున్నారు. నలబై రెండు లక్షల మందికి రుణమాఫీ అన్నారు. ఎంతమందికి చేశారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఎక్కడిస్తున్నారు. ఇవన్నీ నెరవేర్చకుండా ఢిల్లీకెళ్లిఅబద్ధాలు చెబుతున్నారు.ఢిల్లీ ప్రజలు అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరు . మీరు పరోక్షంగా బీజేపీ గెలుపుకు సాయపడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
