కేటీఆర్ కంటే ముందే రేవంత్ విచారణ..?

Revanth investigation before KTR..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద ఫిర్యాదు చేశానన్నారు.
కేవలం రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలను విల్లును చూపెట్టడం కోసం,ఏదో అవినీతి జరిగిందని ప్రజలకు అబద్దాలు చెప్పి,వేలాది మంది నిరుద్యోగుల బతుకుల్లో మన్ను కొట్టిన రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్ పదేళ్ల పాలనలో, ఏ నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన ప్రజా ప్రయోజన పథకాలను (ఆరోగ్య శ్రీ,ఫీజు రియింబర్స్ మెంట్,ఉచిత విద్యుత్,జలయజ్ఞం) రద్దు చేయలేదు.
కానీ రేవంత్ రెడ్డి అదేపనిగా ముందుకెల్తున్నారు ఇది తెలంగాణ భవిష్యత్ కు ప్రమాదకరం..రాగద్వేషాలు లేకుండా,రాజ్యాంగబద్దంగా పరిపాలిస్తానని ప్రమాణం చేసిన సిఎం, నేడు తన సోదరులకు అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతూ రాచమర్యాదలు చేస్తున్నారు.తన మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇదంతా రాగద్వేషం,రాజ్యాంగవిరుద్ధం కాదా? అని ప్రశ్నించారు..పోలీసు మిత్రులారా , హోం మంత్రి,ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టకుండా చూడకండి.ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే అనే నిబంధన మరువకండి.మీరు పట్టించుకోకపోతే,న్యాయస్థానం ఉందని మరవకండని ఆయన గుర్తుచేసారు.
