రుణమాఫీ పై ప్రజల్లోకి కాంగ్రెస్
రేపు అనగా జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటల లోపు రైతులందరీ ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులను జమ చేయనున్నది..
రుణమాఫీ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకి పూలే భవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. డీసీసీ అధ్యక్షులు…సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి …కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో రుణమాఫీ గురించి సంబరాలు పై చర్చించనున్నారు. అంతేకాకుండా అన్ని గ్రామాల రైతు వేదికల సాక్షిగా ఈ వేసుకలను నిర్వహించాలని చూస్తుంది కాంగ్రెసు పార్టీ.