లష్కర్ బోనాల మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి తోపాటు పూజలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ శ్రీగణేష్, ఎమ్మెల్సీ శ్రీ బల్మూర్ వెంకట్, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.