మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం…?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా సంగెం మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ ” మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు.. డ్రీమ్ ప్రాజెక్టు.
ఆరున్నరేండ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎన్నో కలలు కన్నారు. మాతో మరెన్నో సార్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తాది. మళ్లీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.