నీలెక్క అందరూ దందాలు చేయరూ రేవంత్ రెడ్డి..!

Revanth Reddy Anumula
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు దందాలు .. అక్రమాలు చేసేవాడికి అందరూ అలానే అన్పిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ ,ఐపీస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హారీష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎక్స్ లో ” ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా.. అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి తగదని హితవు పలికారు. సహచర ఎమ్మెల్యేలను కొనబొయి డబ్బుల బ్యాగులతో దొరికినట్లు.. మీలెక్కనే అందరూ సెటిల్మెంట్ .. బ్లాక్మెయిల్ చేస్తారని అనుకోవడం తప్పు.
ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులు మన దేశానికి.. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముక . తెలంగాణ వచ్చిన పదేండ్లలో దేశానికి ఆదర్శంగా నిలవడంలో వారి పాత్ర ఆమోఘం. అలాంటివారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి ప్రతిష్టను దిగజార్చడమే అని ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.
