రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..!

ముఖ్యమంత్రి తన స్థాయిని మరచి వీధి రౌడీలా దిగజారుడు భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే కెసిఆర్ గారికి క్షమాపణలు చెప్పాలనిబీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం వనపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్లమల ముద్దుబిడ్డగా చెప్పుకునే నీవు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఏం చేశావని ప్రగల్బాలు పలుకుతున్నావు.కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా రేవంత్ మాట్లాడడం లేదు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ కెసిఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు.పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు.రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం…?బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే…
కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన కల్వకుర్తి, బీమా,నెట్టంపాడు,కోయిలసాగర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాయకుడు కెసిఆర్ గారు.కాంగ్రెస్ హయాంలో నత్త నడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తి చేసింది బిఆర్ఎస్. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్పే సత్యం. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బిఆర్ఎస్.
మిషన్ కాకతీయతో భాగంగా మహబూబ్ నగర్ లో 1544 చెరువులు, నాగర్ కర్నూల్ లో 2024, నారాయణ్ పేటలో 950, గద్వాల్ లో 563, వనపర్తిలో 1329 మొత్తం 6410 చెరువుల కింద 3లక్షల 22వేలు 579 ఎకరాలు స్థిరీకరించాం. 66 చెక్ డ్యాంలు, ఐడీసీ లిఫ్ట్ ల కింద మరో 24వేల ఎకరాలు స్థిరీకరించాం.పదేండ్ల కాలంలో ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినం. పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చినం. ఈ చరిత్ర మీరు చెప్పక పోయినా, పదేండ్లు పచ్చగా పంటలు పండించుకున్న రైతులను అడిగితే చెబుతారు.
ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి కేసుల మీద కేసులు వేసి ఆలస్యమయ్యేటట్టు చేసింది మీ కాంగ్రెస్ నాయకులు కాదా..? కెసిఆర్ గారు 90 శాతం పనులు పూర్తి చేశారు నీవు ముఖ్యంత్రివి అయి 15 మాసాలు ఐంది 15 తట్టల మట్టికూడా తీయలేదు తక్షణమే మిగతా 10 శాతం పనులు పూర్తి చేస్తే పాలమూరు,రంగారెడ్డి జిల్లాలు శస్యశామలం అవుతాయి.పచ్చి అబద్ధాలు, పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్టు కారు పూతలు బంద్ చెయ్.కేసీఆర్ అంటే పచ్చని పంటలు, రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్దాలు అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్చగా రోజుకు 10వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నడు. ఇదేందని మేము ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి, మా మీద రంకెలు వేస్తున్నరు.11000 క్యూసెక్కుల నీటి సామర్థ్యము ఉన్న పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచడం కోసం ప్రణాళికలను సిద్ధం చేసి 13.9.2005 రోజున జీవో నెంబర్-170 ను తెచ్చే కంటే 2 నెలల ముందే 4.7.2005 రోజున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెరాస మంత్రులు బయటకు వచ్చి తెలంగాణకు కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన చరిత్ర కెసిఆర్ గారిది.
పదే పదే కెసిఆర్ గారిని 811 టీఎంసీ లలో 512 ఆంధ్రకు 299 తెలంగాణకు ఒప్పుకున్నావు అని తప్పుడు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డ్ గారు తెలంగాణ వచ్చిన మొదటి నీటి సంవత్సరం లో తాత్కాలికి ఒప్పందాన్ని మాత్రమే చేసుకొని వచ్చే సంవత్సరం నుంచి 50,50 శాతము నీటి కేటాయింపులు ఉండాలని 2015 జూన్ 18,19 తేదీలలో జరిగిన అంతరాష్ట్ర మీటింగ్ యొక్క మినిట్స్ చూస్తే వాస్తవాలు తెలుస్తాయి అని విజయ్ కుమార్ డిమాండే చేశారు.నీకు చాతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు అని హితవు పలికారు
