రేవంత్ చెప్పిన పని చేస్తే నన్ను అరెస్ట్ చేశారు..!

బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినందుకే నన్ను జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట నన్ను అరెస్ట్ చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ” గతంలో పీసీసీ చీఫ్ గా… ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను గళ్లా పట్టుకుని నిలదీయండి. ఎందుకు మీరు పార్టీలు మారారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మీ మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలని ఎక్కడక్కడ గ్రామాల్లో పల్లెల్లో నిలదీయాలని అన్నారు.
నేను అదే చేశాను. మా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఎలా కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరాను. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేశారు. ఇదేక్కడి ప్రజాస్వామ్యం. నేను నామినేటేడ్ పదవిలో లేను.. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వచ్చిన ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకెళ్లాలి అని ఆయన అన్నారు.
