బాబును చూసి నేర్చుకో రేవంత్
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అన్నట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేసిన ఇనుప కంచెలను తొలగించి అదేదో మాజీ సీఎం కేసీఆర్ వేసిన కంచెల మాదిరిగా ప్రగతి భవన్ గోడలను బద్ధలు కొట్టి ప్రజలను లోపలకు రానీచ్చాము.. రానీవ్వడమే కాకుండా వారంలో ఒకరోజు ప్రజావాణి పేరుతో తానే అక్కడ ఉండి ప్రజల సమస్యలను విని తీరుస్తాను అని కొత్త మురిపెం అన్నట్లు ఒకటి రెండు రోజులు తాను అందుబాటులో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆ తర్వాత కొన్ని రోజులు మంత్రులు.. ఇప్పుడు కార్పోరేషన్ కమిటీ చైర్మన్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ఓ పెద్దస్కాము.. అందుకే మేడిగడ్డ కృంగింది. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎసోళ్ళు దోచుకున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకెళ్ళడం ఖాయం.. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిది. మేము పనికోచ్చే ప్రాజెక్టులను నిర్మించి తీరుతాం అని ఓ మూడు నెలలు అదే వార్తలతో ప్రచారంలో ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అదే మేడిగడ్డలో కృంగిన ఫిల్లర్లను పునర్నిర్మించే పనుల్లో బిజీగా ఉన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఫాం హౌజ్ కోసం కట్టారు అని వార్తలు ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాలకు అదే ప్రాజెక్టు నుండి తాగునీళ్ళు తెచ్చే పనుల్లో బిజీగా ఉంది హైదరాబాద్ జలమండలి. తెలంగాణ పేరును TS నుండి TG గా మారుస్తున్నాము అని .. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాము అని ప్రచారంచేసి వాటిని మార్చే పని చేసింది కాంగ్రెస్ సర్కారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్నే ఒక ఊపు ఊపిన గీతాన్ని రాష్ట్రం వచ్చాక రాష్ట్ర గీతంగా కేసీఆర్ మారిస్తే లేదు అది రాచరిక పోకడలను పోలి ఉంది .. నేను మార్చి తీర్చాల్సిందే అంటూ పట్టుబట్టి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేత చేయించి చేతులు కాల్చుకున్నారు.
అఖర్కి రాజముద్రను మార్చాలని.. అందులో ఉన్న కాకతీయ తోరణాన్ని తొలగించి.. చార్మీనార్ ను తీసేసి కొత్తది తయారు చేసి తన అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. తెలంగాణ వాదులు,బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జిల్లాలను కుదిస్తామంటూ ఓ లీకేజీని బయటకు వదిలారు.దీనిపై కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని పక్కకు పెట్టింది కాంగ్రెస్ సర్కారు. తాజాగా స్కూల్ పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉందని పంపిణీ ఆపేయమని..కొత్తవి ప్రింట్ ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.దీనిపై కూడా వ్యతిరేకత రావడం తో ఉన్నది ఉన్నట్లు పంపిణీ చేయడానికి ముందుకోచ్చింది కాంగ్రెస్ సర్కారు. గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రైతు రుణమాపీ చేస్తాము.. ఆసరా కింద ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తాము. రైతుబంధు కింద పదిహేను లక్షలు ఇస్తాము అని మాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ సర్కారు.
నాలుగు వేల రూపాయల పించన్ ను పక్కకు పెట్టు కనీసం గతంలో వచ్చే రెండు వేల రూపాయల పించన్ కూడా ఇప్పటికి రావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక రైతన్నల పరిస్థితుల గురించి చెప్పనక్కర్లేదు. ఒక మంత్రి ఏమో రైతుబంధు డబ్బులు ఆపి ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని అంటారు.సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి ఏమో ఇంకా రైతుబంధు వేయలేదు అంటారు.ఏకంగా వ్యవసాయ మంత్రి ఏమో ఎనబై శాతం పూర్తయిందంటరు. ఇంకోక మంత్రి ఏమో రైతుబంధు రుణమాఫీ అడిగిన రైతులను చెప్పుతో కొడతానని అంటారు.ఇలా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదటిరోజే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మెగా డీఎస్సీపై సంతకం… ల్యాండ్ చట్టం రద్ధుపై సంతకం.. ఆసరా పెంపుపై సంతకం..స్కిల్ సెన్సెస్ ఫైల్ పై సంతకం.. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ఇలా ఒక్కటేమి ఐదు సంతకాలు చేశారు చంద్రబాబు.
ఇలా ఏపీలో నవశకానికి నాంది పలకడమే కాకుండా స్కూల్ పిల్లలకు అందించే పుస్తకాలు.. బ్యాగులపై మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న కానీ అలాగే అందించాలని ఆదేశించిన నీ గురువు టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం నేర్చుకో రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైన రేవంత్ రెడ్డి దారిలోకి వస్తారో లేదో చూడాలి మరి..?