రేవంత్ రెడ్డి అధికారం ఐదేళ్ళే..!
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. కేవలం రైతులను, బీఆర్ఎస్ వాళ్లను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. జైల్లో ఉన్నవాళ్లను చిత్రహింసలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నియంత లెక్క పాలిస్తున్నాడు.
ఈ ఘటనలో సంబంధం ఉన్న కాంగ్రెస్ వాళ్లను వదిలేస్తున్నారు. తెలంగాణ సమాజం తిరగబడుతుంది. ముఖ్యమంత్రిసొంత నియోజకవర్గం కొడంగల్ నుండే ఆయన పతనం మొదలైంది. మేము ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. భూములు తీసుకుంటున్న రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. మేము పదేండ్లలో ఎన్నో ప్రాజెక్టులు కట్టాము. ఇలా ఎప్పుడు రైతులు, ప్రజలు రోడ్లపైకి రాలేదని గుర్తు చేశారు.