అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందన..?
![అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి స్పందన..?](https://www.singidi.com/wp-content/uploads/2024/12/anumula-revanth-reddy-1-850x560.jpg)
Revanth Reddy’s reaction on Allu Arjun’s arrest..?
సంధ్య థియోటర్ తొక్కిసలాట ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ ..స్టార్ హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వ వైపల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.
సాధారణ నేరస్తుడిలా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ” చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం లేదు అని ఆయన స్పష్టం చేశారు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని ఆయన ఉద్ఘాటించారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)