లగచర్ల ఘటనపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వేముల వాడ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో జరిగిన ప్రజావిజయోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” లగచర్ల ఘటనలో అధికారులను చంపాలని కుట్రకు తెరలేపారు. కొంతమంది రౌడీలను ఉపయోగించి కలెక్టర్ ,అధికారులపై దాడికి తెగబడ్డారు. తన నియోజకవర్గంలో లక్ష ఎకరాలను ప్రజల భూములను లాక్కుకున్నట్లు నేను లాక్కోవడం లేదు.
నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ కావాలి. పదేండ్లలో లక్షల ఎకరాలను లాక్కుకున్నారు. కానీ మేము రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నష్టపరిహారం అందజేస్తాము.. నా నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు రావాలనుకోవడం తప్పా..?. పరిశ్రమలు రావాలని కోరుకోవడం తప్పా…? అని ప్రశ్నించారు.
హారీష్ రావు లెక్క నేను భూములను లాక్కోని ఫామ్ హౌజ్ లు కట్టుకోవడం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు పెట్టిస్తున్నాను. కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ జరిగి తీరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి తీరుతాము. బీఆర్ఎస్ నేతలు అడగుడగున అభివృద్ధికి అడ్డుపడుతున్నారు . ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.