ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో చేసిన అప్పులే కారణం.పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది.
పదేండ్లలో అప్పులతో తమకు తాము బాగుపడ్డారు తప్పా రాష్ట్రంలో ఏ వర్గాన్ని బాగుచేయలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పులు.. పాపాలు లేకపోతే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాము. సచివాలయం , ప్రగతి భవన్ లో టీవీలు పెట్టుకున్నారు కానీ హాస్టళ్లల్లో బాత్రూమ్స్ గదులు ఎందుకు కట్టలేదు. వ్యసనాలు వ్యాపారాలు సంపదను బీఆర్ఎస్ కొల్లగొట్టారు.
ఢిల్లీకి వెళ్లి పలుమార్లు ఆర్థిక శాఖను వడ్డీలను తగ్గింహమని కోరారు. పదకొండున్నర శాతంతో దొరికినకాడ అప్పులు తెచ్చారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో.. తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడకుండా ఉన్నారు. మేము గజ్వేల్ జన్వాడ లో ఫామ్ హౌజ్ లు కట్టుకోలేదు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వలనే పథకాల అమలు ఆలస్యమవుతున్నాయని అన్నారు.