రేవంత్ సర్కారు హైకోర్టు షాక్..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు బిగ్ షాకిచ్చింది.
కొడంగల్ నియోజావర్గంలోని లగచర్ల లో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడంపై హైకోర్టు తప్పు పట్టింది.
ఫిర్యాదుదారులు మారిన ప్రతిసారి కొత్త ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా సమర్ధించుకుంటారని కోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు రాసిన రైటర్,తేదీలు,నిందితుల పేర్లు ,కంటెంట్ మాత్రం ఒకేలా ఉన్నాయి. కాపీ కొట్టడానికి కూడా కొంత తెలివి అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.