కాంగ్రెస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” గత పదినెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు టెస్ట్ ఫార్మాట్ లో రాజకీయాలు చేస్తున్నారు.
కానీ ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ లోనే రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది.కాంగ్రెస్ నేతలు ప్రస్తుత రాజకీయ విధానాలకు అప్ గ్రేడ్ అవ్వాలి. అందుకే కాంగ్రెస్ నేతలు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ ఆడాలని ఆయన సూచించారు.
బీజేపీ హిట్ ఔట్ లేదా హిట్ ఇన్ అనే విధానంతో రాజకీయాలు చేస్తుంది. ఆ పార్టీ నేతల మధ్య కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇతర పార్టీలకు చెందిన నేతలపై సీబీఐ ఈడీ లను పంపి లొంగదీసుకుంటూ బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.