వికారాబాద్ -కృష్ణా రైల్వే రూట్ మ్యాప్ పై రేవంత్ రెడ్డి సమీక్ష

 వికారాబాద్ -కృష్ణా రైల్వే రూట్ మ్యాప్ పై రేవంత్ రెడ్డి సమీక్ష

దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన ‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ గారు, ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం గారిని ఆయన కార్యాలయంలో కలిసి, వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రెజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారు రూ.3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు.

‘వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్’ ప్రణాళికల్ని వడివడిగా పూర్తిచేసి, పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి గారు, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన గారు తదితరులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *