జైలు శిక్షపై ఆర్జీవీ స్పందన..!

RGV’s response to imprisonment..!
2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి మనకు తెల్సిందే. మహేశ్ చంద్ర అనే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆర్జీవీ స్పందించారు.
‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.
