రోహిత్ సారధిగా ఛాంపియన్స్ ట్రోఫీకి..!
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కు చివరి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించేందుకు సెలక్షన్ కమిటీ సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించాల్సి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియా ఆడే చివరి వన్డే సిరీస్ కూడా ఇంగ్లండ్‌తోనే. ఈ క్రమంలో ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేస్తారా..? లేదా..? అనేది అనుమానంగా ఉంది. అతడికి విశ్రాంతి ఇచ్చి హార్దిక్‌కు సారథ్యం అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి.
కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగబోతోందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్న వేళ.. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కూ రోహిత్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. 37 ఏళ్ల రోహిత్‌కు ఇదే చివరి ఐసీసీ టోర్నీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.