మళ్లీ సినిమాల్లోకి రోజా ఎంట్రీ…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. మొదట సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి.. ఆ తర్వాత బుల్లితెరపై అలరించి.. ఏపీ ప్రజల మన్నలను పొంది… ఎమ్మెల్యేగా .. మంత్రిగా పని చేశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన రోజా ఓడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రోజా మాట్లాడుతూ మళ్లీ తాను సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు ఆసక్తి వ్యక్తపర్చారు.
‘బాహుబలి’ శివగామి, ‘అత్తారింటికి దారేది’ అత్త తరహా క్యారెక్టర్లు లేదా డాక్టర్, లాయర్ వంటి కీలక రోల్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో రోజా చెప్పారు. 90వ దశకంలో హీరోయిన్ గా మెప్పించిన రోజా సెకండ్ ఇన్నింగ్స్ గోలీమార్, మొగుడు లాంటి సినిమాల్లోనూ నటించారు.