రూ.2 వేలతో రూ.40 లక్షలు..!

Telangana CMO Addaga threatens multinational liquor companies
ప్రముఖ భారతీయ బ్యాంకు తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రమాద బీమా పాలసీని తీసుకోచ్చింది. అందులో భాగంగా రూ.2 వేలతో రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది..
భారతీయ స్టేట్‌బ్యాంకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని (పీఏఐ) మరింత విస్తరించింది.ఈ క్రమంలోనే ఏడాదికి రూ.2000 ప్రీమియంతో రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది.
ప్రీమియం రూ.100కు రూ.2 లక్షలు మొదలుకుని గరిష్టంగా రూ.2 వేలకు రూ.40 లక్షల బీమా పొందవచ్చని వివరించారు.రోడ్డు ప్రమాదాలు, కరెంట్‌షాక్, వరదలు, భూకంపం, పాము, తేలు కాటు మరణాలకు బీమా వర్తిస్తుందని చెప్పారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారెవరైనా బీమా చేయించుకోవచ్చని వెల్లడించారు.
