మహిళలకు ఫ్రీ బస్సు పై RTC కీలక నిర్ణయం

RTC decision on free bus for women
4 total views , 1 views today
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హమీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది..
గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్సులుగా నడుపుతోంది.
వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్ ప్రెస్ బస్సుల కంటే 10% ఛార్జీలు అధికంగా ఉంటాయి. పల్లెవెలుగు కంటే 5 సీట్లు ఎక్కువగా ఉండటంతో ఆదాయమూ సమకూరుతుంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు..త్వరలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకూ విస్తరించనున్నారు.
