వాళ్లకి మాత్రమే రూ.2500లు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500లు ఇస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న కానీ ఈ పథకం అమలు గురించి అసలు ఊసే లేదు.
తాజాగా ఈ హామీ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది.. అందులో భాగంగా ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు (కొత్త వారికి) మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారట.