హైదరాబాద్ లో దీపావళి వేడుకలపై అంక్షలు
హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలపై సైబరాబాద్ పోలీసు శాఖ అంక్షలను విధిస్తూ ఓ ఉత్తర్వులను జారీ చేసింది..ఇందులో భాగంగా ఈరోజు నుండి నవంబర్ రెండో తారీఖు వరకు ఈ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాల సమయంలో రోడ్లమీద పటాకులు పేల్చడం నిషేధం.రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు లోబడి పటాకులు పేల్చాలి.
ఈ ఆదేశాలు తేదీ 31.10.2024 ఉదయం 6 గంటల నుంచి తేదీ 02.11.2024 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.