డిప్యూటీ సీఎం పవన్ పై పుకార్ల జోరు..?
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు అర్జున్.. ప్రభాస్ .. అనుకోవచ్చు.
కానీ స్టార్ హీరోకి ముందు పొలిటికల్ అనే పదం వాడటంతో ఆది కాస్తా పవన్ కళ్యాణ్ పైకి వెళ్లింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు పవన్ ఒప్పుకున్న హరిహరవీరమల్లు, ఓజీ,ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కెళ్లడానికే ఆయనకి టైం దొరకడం లేదు.. తనకు దగ్గరలో అంటే ఉండవల్లి సమీపాన హరిహర వీరమల్లు మూవీ సెట్ ఏర్పాటు చేసిన కానీ పవన్ అక్కడకి వెళ్లడానికి వీలుండటం లేదు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ దేవుడేరుగు.. మరోవైపు ఇరవై రోజులు కాల్షీట్లు ఇస్తే ఆ సినిమా పూర్తవుతుంది.
అయిన కానీ పవన్ దగ్గర ఇరవై రోజుల సమయమే లేదు. ఇప్పుడే ఇంత బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చేన్నికల నాటికి ఎంత బిజీగా ఉంటారో ఊహించుకోవచ్చు అని సినీ పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు. అయితే నాగవంశీ చేతిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో పవన్ ఉన్నాడు. వచ్చేన్నికల నాటికి అంటే పవన్ పొలిటికల్ కేరీర్ కు. జనసేన పార్టీకి బలం అవుతుంది కాబట్టి ఈ సినిమా అప్పట్లో సెట్ పైకి రావోచ్చు అని కూడా పుకార్లు ఫిల్మ్ నగర్లో విన్పిస్తున్నాయి. చూడాలి మరి ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తవుతాయా..?. మరి నాగవంశీ కల నెరవేరుతుందా అని ..?