చదువుకున్న స్కూల్ కి గెస్ట్ గా సాయి పల్లవి..

Sai Pallavi as a guest of the school where she studied..
తమిళనాడులోని కోయంబత్తూర్ లో “అవిలా కాన్వెంట్ స్కూల్” లో చదివింది. ఆ స్కూల్ కే మళ్ళీ సాయి పల్లవి గెస్ట్ గా వెళ్ళింది. “ఈ స్కూల్ లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ స్కూల్లో ఎక్కువగా నచ్చింది ఆడిటోరియం మాత్రమే.. ఎందుకంటే చాలాసార్లు క్లాసులు ఎగ్గొట్టి మరీ ఈ ఆడిటోరియంలో గడిపిన సందర్భాలు ఉన్నాయి.
అలాగే నాకు డాన్స్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆడిటోరియంలో ఎక్కువగా గడిపేదాన్ని. అందుకే చిన్నప్పటినుండే నాకు స్టేజ్ ఫియిర్ కూడా లేదు.నేను ఈ ఆడిటోరియం ని మిస్ అయ్యి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంది.ఇంత మంచి స్కూల్,నా పేరెంట్స్ కారణంగా నేను ఎలాంటి చెడు అలవాట్ల దరికి కూడా పోలేదు. నా పూర్తి ఫోకస్ మొత్తం చదువు పైనే పెట్టేసాను.

ఈ స్కూల్లో చదువు మాత్రమే కాదు డాన్స్ కూడా నేర్చుకున్నాను. అందుకే నా ఫుల్ ఫోకస్ డ్యాన్స్,చదువు మీదే ఉండేది.అంతేకాకుండా ఈ స్కూల్ ద్వారా నేను ఎదుటివారితో ఎలా ఉండాలి. ఎంత క్రమశిక్షణగా మెదలాలి.. అనేది కూడా నేర్చుకున్నాను. ఒక మనిషిగా ఎలా ఉండాలి అనేది మొట్టమొదటిసారి నేర్చుకున్నది ఈ స్కూల్ ద్వారానే.ఈ స్కూల్లోనే పెద్దయాక నేను ఏమి అవ్వాలి? నా గోల్ ఏంటి అనేది? తెలుసుకొని నాతో నేను ఎన్నోసార్లు లోలోపల మాట్లాడుకున్నాను.
సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది అమరన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో మన ముందుకు వచ్చింది. అలాగే మరికొద్ది రోజుల్లో తండేల్ మూవీతో పలకరించబోతుంది.
