విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యువసామ్రాట్ అక్కినేని వారసుడైన అక్కినేని నాగచైతన్య తో హాటెస్ట్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఆ తర్వాత చైతూ శోభిత ను పెళ్ళాడిన విషయం కూడా తెల్సిందే.
తాజాగా హీరోయిన్ సమంత తన విడాకుల అంశం గురించి మాట్లాడుతూ ” నేటి రోజుల్లో ఓ మహిళ విడాకులు తీసుకుంటే సదరు మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ ‘నా గురించి.. నావిడాకుల విషయం గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు.
అందులో నిజం లేదని నాకు చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే నన్ను ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా నేను ఏడుస్తూ నాకున్న ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.
