శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 220స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.
మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి యాబై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు పదమూడు స్థానాల్లో ఆధిక్యత ను కనబరుస్తున్నారు. తాజా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ” ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి బీజేపీ కూటమి గెలిచింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పై ప్రజలు తీవ్ర ఆగ్రహాంగా ఉన్నారు. ఈవీఎంలను మ్యానేజ్ చేసి గెలిచారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.