భార్యలకు ఫ్లాష్ బ్యాక్ చెప్పొద్దు..!
సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు.
‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తుండగా ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు.