సంక్రాంతి హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి..!

That movie changed my life
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి పండక్కి వచ్చిన ప్రతి మూవీ సూప డూపర్ హిట్ సాధించాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిన్న సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మంచి హిట్ టాక్ తో థియోటర్లనందు సందడి చేస్తుంది. వరుసగా ప్రతి సంక్రాంతికి ఇప్పటివరకు తాను విడుదల చేసిన ఎనిమిది సినిమాలు విజయవంతం అయ్యాయి. దీంతో వరుసగా ఎనిమిది చిత్రాలను విజయవంతం చేసుకున్నాడు అనిల్.
వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నా ఈతరం దర్శకుడు అనిల్ రావిపూడి అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీమ్, పటాస్, రాజా దిగ్రేట్,ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు,ఎఫ్3,భగవంత్ కేసరి విజయాలను అందుకున్నాయి. దీంతో వందకు వంద శాతం సక్సెస్ రేటును అనిల్ కొనసాగిస్తున్నాడు.
