వైసీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో అవినీతి..!

4 total views , 1 views today
జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు..అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీలీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది..
మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాము.. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు.. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాము.. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్‌లో కొత్త అధికారులను నియమించాము..
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.. దుర్వినియోగం అయిన కొంత సొమ్ము రికవరీ చేశాము.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు..
