కాంగ్రెస్సోళ్లు చెప్పినోళ్లకే పథకాలు..!

సహాజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ముందుగా ప్రభుత్వ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు. నేతలకే ఇస్తారు. ఇది మన స్వతంత్ర భారతంలో ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఎవరూ కూడా బహిరంగంగా ఈ విషయం చెప్పరు. కానీ తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు చెప్పినవాళ్లకే ప్రభుత్వ పథకాలు అని తేల్చి చెప్పారు.
ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందజేస్తాము.. ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెగేసి చెప్పారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు .
గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే అ గ్రామంలో ఎవ్వరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగంగానే హెచ్చరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.
