పాఠశాలల పనివేళల మార్పు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్పు చేశారు..
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…