సుప్రీంకోర్టులో రేవంత్ సర్కారుకి చీవాట్లు..!

దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. బీఆర్ఎస్ తరపున గెలిచిన పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.
దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును అశ్రయించింది. ఈ పిటిషన్ పై పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ సమయంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం తరపున వాదిస్తున్న ముకుల్ రోహిత్గి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారించిన మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత??.రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తానని ముకుల్ రోహిత్గి తెలపడంతో తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.
