మంత్రి అయిన నేనింకా విద్యార్థినే.
తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క.
మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు.
తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.