ఐపీఎల్ జట్టు చెన్నైపై సంచలన ఆరోపణలు
ఐపీఎల్ ప్రారంభం కాకముందే ప్రధాన జట్లల్లో ఒకటైన చెన్నై జట్టుపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు.
ఓ ఇంటర్వూలో లలిత్ మోదీ మాట్లాడుతూ సీఎస్కే జట్టు ఓనర్ శ్రీనివాసన్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపించారు. గతంలో ఆయన బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు చెన్నై టీమ్ లోకి ఎలాగైనా ఫ్లింటాఫ్ ను తీసుకోవాలని అనుకున్నారు.
అందుకే అతనికోసం బిడ్ వేయద్దు అని అన్ని జట్లకు చెప్పామన్నారు. శ్రీనివాసన్ చెన్నై మ్యాచులకు అంపైర్లను మార్చి స్థానిక అంపైర్లను నియమించేవారమని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలతో ఐపీఎల్ సీఎస్కే జట్టును రెండేండ్ల పాటు బ్యాన్ చేసిన సంగతి మనకు తెల్సిందే.