సినిమా వాళ్లతో రేవంత్ భేటీపై నటి సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే.
ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని ఆర్ధమవుతుంది.
హీరోలకు ఏమైన వ్యాపార సమస్యలు వస్తేనే ఇండస్ట్రీ అండగా ఉంటుంది అని ఆమె ట్విట్టర్ లో సెటైరికల్ పోస్టు చేశారు. నిన్న జరిగిన ఈ భేటీలో ఇండస్ట్రీ నుండి ఒక్క మహిళ కూడా హాజరు కాలేదు. అందుకే నటి పూనమ్ కౌర్ ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు ఆమెకు మద్ధతు పలుకుతున్నారు.