వైసీపీపై వైరల్ అవుతున్న సెటైర్లు
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది.
ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం.
ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ విలవిలలాడుతన్న పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు ఎక్కడ తేడా కొట్టింది..? ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయిందో కూడా ఊహించుకోలేని.. మాట్లాడుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది.
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే సోషల్ మీడియా వేదికగా ఏపీలో ఏం నడుస్తోంది..? వైసీపీని జనాలు ఏ జిల్లాలో ఎలా ఓడించారు..? ఏయే జిల్లాల ప్రజల మనోగతం ఏమిటి..? అని ఒక మెసేజ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి..!