రేవంత్ రెడ్డిపై షర్మిల ప్రశంసల వర్షం
మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ అదే పదిహేనేండ్ల తర్వాత ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో లక్షలోపు రుణాలను మాఫీ చేయడం అభినందించదగ్గ విషయం.. దేశ చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ.. ప్రభుత్వం కాంగ్రెస్. అలాంటి మహోత్తర ఘట్టానికి కేంద్రమైన రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు శుభాకాంక్షలు..
కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు వస్తేనే దేశంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ,సోనియా గాంధీలు ఇచ్చిన ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అమలవుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు. వారికి శుభాభివందనాలు.. రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తారని కోరుకున్నట్లు”ఆమె ట్వీట్ చేశారు.