జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో షర్మిల మాట్లాడుతూ ” రాజకీయాల్లో మహిళలు ఉండాలంటేనే భయం పుట్టే పరిస్థితులను వైసీపీ సోషల్ మీడియా వారీయర్స్ కల్పించారు.
ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారంతా విషనాగులే.. వీరి వెనక ఉన్న అనకొండ ను అరెస్ట్ చేయాలి. నాడు నన్ను సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తూ ఎన్నో పోస్టులు చేశారు. ఓ మహిళ అని చూడకుండా నీచాతి నీచంగా పోస్టులు పెడుతూ రాక్షస ఆనందం పొందారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లననడం ప్రజలను అవమానించినట్లు కాదా ? అని ఆమె ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసా.. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎన్నికలప్పుడు చెప్పారా ఓడిపోతే అసెంబ్లీకి వెళ్లము అని .. అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్లు కాదా షర్మిల నిలదీశారు.