కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కి షాక్
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కు చేదు అనుభవం ఎదురైంది.
నియోజకవర్గంలో నవాబుపేట మం. తిమ్మారెడ్డిపల్లికి ఎమ్మెల్యే యాదయ్య వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
అయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. ఇప్పటికే నవాబుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ నిరాహార దీక్ష సైతం చేశారు. అయినా యాదయ్యను పార్టీలోకి చేర్చుకోవడంతో ఆందోళన చేపట్టారు.