లోక్ సభలో కేంద్ర మంత్రికి చేదు అనుభవం
ఈరోజు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ నేపథ్యంలో లోక్ సభలో కేంద్రమంత్రికి చేదు అనుభవం ఎదురైంది..
సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసొచ్చే వరకూ విపక్ష సభ్యులు ‘నీట్.. నీట్’ అని అరిచారు.
అయితే మరోవైపు నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంపైనా విమర్శలొస్తున్నాయి.