మంత్రి పొంగులేటికి షాక్..!

 మంత్రి పొంగులేటికి షాక్..!

Loading

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ & ఐఎన్ పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పాలేరులో గట్టి షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని దుబ్బ తండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబ్బల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చారు. దీనిపై స్థానికులు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రస్తుతం అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీశారు. ఎంత నచ్చచెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి గిరిజన మహిళలు దిగారు.

చివరికి సహనం కోల్పోయి గిరిజనుల, స్థానిక అధికారులపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ కవరేజ్ కోసం వచ్చిన మీడియాను సైతం వీడియోలు తీయకుండా ఉండాలని ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల మోసంపై మంత్రిని గిరిజనులే స్వయంగా నిలదీయడం ఖమ్మం తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.భోగి రోజున బోగస్ పంపకాలంటూ గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును స్థానిక కాంగ్రెస్ నాయకులు తారుమారు చేశారని మంత్రిని చుట్టుముట్టి లంబాడ మహిళలు కదలకుండా నిలదీసి ప్రశ్నించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *