బీఆర్ఎస్ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఢుమ్మా..?
బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఢుమ్మా కొట్టారు. రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ దళపతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు వివరించారు.
ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీలు చల్లా,గోరటి తదితరులు ఢుమ్మా కొట్టారు.
రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హజరు అవుతారో కారో ఇంకా కన్ఫార్మ్ కాలేదు. గత ఎన్నికల తర్వాత జరిగిన తొలి సెషన్ లో అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ హాజరు కాలేదు.