ఇండియా కూటమికి ఎస్పీ గుడ్ బై..!
ఇండియా కూటమి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోనున్నది.. తాజాగా ఈ కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్నకు మరోసారి రావాలని గతంలోనూ అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.
తమకు మద్దతిచ్చినందుకు ఆప్ కన్వీనర్ కేజీవాల్ ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.