ఆరు గ్యారెంటీలు తెలియక ఇచ్చామంటున్న స్పీకర్ ..?

కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి అదికారం లోకి వచ్చింది.అదికారంలోకి హామీల అమలులో జాప్యం జరుగుతూ వస్తుంది.100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పినా 420 రోజులు పూర్తైనా అమలు మాత్రం చేయలేకపోయింది.కొన్ని హామీలు అమలు చేసినా అవి అసంపూర్ణంగానే ఉంది.420 రోజులైనా హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ ఈ రోజు గాంది విగ్రహనికి వినతిపత్రాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతుంది..
హామీల అమలు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వాఖ్యలు చేసారు..రాష్ట్రంలో హామీల అమలు ఆలస్యమవుతుందన్నారు.ఎన్నికల నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక హామీలు ఇచ్చామన్నారు. రాష్ట్ర అప్పులు,వాటికి కట్టాల్సిన మిత్తి ఎంత ఉందో తెలియక హామీలు ఇచ్చామన్నారు.
రేవంత్ రెడ్డి నిర్విరామంగా పనిచేసినా ఆర్థిక పరిస్థితి వల్ల హామీల అమలు జాప్యం అవుతుందన్నారు.స్వయంగా స్పీకరే ఇలాంటి వాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.ఇటీవల ఒక సమావేశంలో ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు.కాంగ్రేస్ ను తిడుతున్నారన్న విషయం తెలిసిందే.
