జాబ్ క్యాలెండర్ పై భట్టి కీలక ప్రకటన
తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు జాబ్ క్యాలెండర్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈరోజు నిరుద్యోగ యువత, ఆయా సంఘాల నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు.. ఈసందర్బంగా గ్రూప్ -2 పరీక్షల అభ్యర్థులతో మాట్లాడుతూ గ్రూప్ -2 పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తాము..
గ్రూప్ -2,3లలో ఎక్కువ పోస్టులను చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము.. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం.. మీరు మా బిడ్డలు.. మీ తెలివితేటలను ఈ రాష్ట్రానికే కాదు దేశానికి వాడుతాము..మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము . విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వేగంగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు.. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దు.
కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం’’ అని ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తాము..ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని భట్టి చెప్పారు..