ఎస్ఎస్ థమన్ పేరు మార్పు…!

ఎస్ఎస్ థమన్ పేరు మార్చుకున్నాడు. అదేంటి అందరి ప్రముఖుల లెక్క పేర్లు మార్చుకోవడం ఎందుకు..!. ఆ అవసరం థమన్ కు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా.?. అసలు విషయం ఏంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ డాకు మహారాజు.
ఈ చిత్రం సక్సెస్ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ” థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందరూ ఇంటిపేరు మార్చారు. థమన్ ను ఎస్ఎస్ థమన్ కాదు నందమూరి థమన్ అని అందరూ అంటున్నారు. ఇక నుండి నందమూరి థమన్ కాదు NBK థమన్ అని నామాకరణం చేస్తున్నాను అని అన్నారు.
