అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతమున్న అరవై నాలుగు సభ్యులు నుండి డెబ్బైకి చేరింది..
బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39 సీట్లు సాధించాయి. ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవడంతో దాని బలం 70కి పెరిగింది.