వెర్రి వెయ్యి విధాలు.. గేమ్ ఛేంజర్ కోసం సూసైడ్ లేఖ..!
వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు పెద్దలు.. ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా… శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం వచ్చేడాది జనవరి పదో తారీఖున సినీ ప్రేక్షక దేవుళ్ల ముందుకు రాబోతుంది.
అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన థియోటరికల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ విడుదల కాలేదు. దీంతో తీవ్ర అసహానానికి గురైన ఓ అభిమాని రామ్ చరణ్ తేజ్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ట్రైలర్, టీజర్ విడుదల చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తూ లేఖ రాశాడు.
ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వెర్రి వెయ్యి విధాలు.. జిహ్వాకో రుచి.. పుర్రెకో బుద్ధి .. ఈ శ్రద్ధ ఏదో తమ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులపై చూపించాలని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. మీరు ఓ లుక్ వేయండి.