ఈవీఎంల గురించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!
దేశంలోని ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని దాఖలైన ప్రజావ్యాజ్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రజావ్యాజ్యం పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు కేవలం ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ పెట్టాలన్న పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నందున భారత్ లోనూ ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్‌ను పునఃప్రవేశపెట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారని.. గెలిచినప్పుడు ఎవ్వరూ ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడటంలేదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యనించింది.మనం మిగతా ప్రపంచానికి ఎందుకు భిన్నంగా ఉండకూడదు.. బ్యాలట్ పేపర్లో జరిగితే ఏంటి? ఈవీఎంలతో జరిగితే ఏంటి? మనం మళ్లీ బ్యాలట్ వైపు మళ్లితే అవినీతి పోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించింది.